ఆకట్టుకుంటున్న ‘ప్రేమ లేదని’ చిత్ర టీజర్

ఆకట్టుకుంటున్న ‘ప్రేమ లేదని’ చిత్ర టీజర్

Published on Oct 27, 2025 12:57 PM IST

జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.డి.నరసింహ దర్శకత్వంలో లక్ష్మణ్ టేకుముడి మరియు రాధికా జోషి ప్రధాన పాత్రల్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మించిన చిత్రం ‘ప్రేమ లేదని’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ ఆద్యంతం గుండెల్ని తాకే ఎమోషనల్ లవ్ స్టోరీగా మేకర్స్ దీన్ని కట్ చేశారు.

లక్ష్మణ్ టేకుముడి-సురేష్ గురు జంటగా కనిపించే కామెడీ సీన్లు, హీరో-హీరోయిన్ల ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌కి నచ్చే విధంగా ప్రజెంట్ చేశారు. జాన్ విక్టర్ పాల్‌ కెమెరా వర్క్‌, సుహాస్‌ సంగీతం ఈ టీజర్‌కు మేజర్ అసెట్‌గా నిలిచాయి.

ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉందని.. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు