పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కించిన సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్స్ బాహుబలి చిత్రాలు కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాలు రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కి తీసుకొస్తుండగా ఈ రీరిలీజ్ లో కూడా బాహుబలి మళ్ళీ కొత్త రికార్డులు సెట్ చేసేలా ఉందని చెప్పాలి.
అయితే లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషనల్ స్టార్ట్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ లక్ష డాలర్స్ గ్రాస్ దగ్గరకి సినిమా దూసుకెళ్తుంది. దీనితో ఇది వరకు ఉన్న రీరిలీజ్ చిత్రాలు తాలూకా లైఫ్ టైం వసూళ్లు ఈ చిత్రం చాలా ముందే క్రాస్ చేసేసేలా ఉందని చెప్పాలి. ఇక ఈ రికార్డుల పరంపర ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే. ఈ అవైటెడ్ చిత్రం ఈ అక్టోబర్ 31న భారీగా రిలీజ్ కాబోతుంది.