టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా బుకింగ్స్ పరంగా ఇప్పుడు దుమ్ము లేపుతుంది.
బుక్ మై షోలో అడ్వాన్స్ సేల్స్ స్టార్ట్ చేయగా ఇపుడు ఏకంగా లక్ష టికెట్స్ ని ఈ చిత్రం సేల్ చేసుకుంది. దీనితో కింగ్డమ్ పట్ల ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. దీనితో కింగ్డమ్ కి భారీ ఓపెనింగ్స్ కూడా దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సితార, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణం వహించారు. ఈ జూలై 31న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి తీసుకురాబోతున్నారు.
Acing the Box Office in a fiery way ????#Kingdom crosses 100K+ tickets already sold on @BookMyShow and the mania is striking big in every nook and corner ????????
????️ – https://t.co/4rCYFkA5dI#KingdomOnJuly31st @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/WQkCWAXBnz
— Sithara Entertainments (@SitharaEnts) July 29, 2025