జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలకు రెడీ అయింది. రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
మొత్తమ్మీద ఈ సినిమాతో మరోసారి నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వి సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.