ఈ ఏడాది అల్రెడీ సంక్రాంతికి మన తెలుగు సినిమా దగ్గర వచ్చిన చిత్రాలు భారీ వసూళ్లు జెనరేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత మళ్ళీ “తండేల్” వరకు మరో సినిమా 100 కోట్ల మార్క్ దాటేది రాలేదు. అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ లో తక్కువే వచ్చాయి. అయితే లేటెస్ట్ గా రెండు సినిమాలు తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ అయ్యాయి.
నిన్న శుక్రవారం నోటెడ్ గా మొత్తం నాలుగు సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తే వాటిలో ఇంట్రెస్టింగ్ గా ఈ తమిళ్ డబ్బింగ్ సినిమాలకి మంచి మార్కులు వచ్చాయి. ఒకటి ప్రదీప్ రంగనాథన్ నటించిన “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” అలాగే మరొకటి ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా “జాబిలమ్మ నీకు అంత కోపమా”. అయితే చూసిన కొందరిలో కూడా ఈ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ వీటి సక్సెస్ కి ఇది ఏమాత్రం సరిపోదని చెప్పాలి. వీటి రెండిటికి కూడా ప్రమోషన్స్ చాలా డల్ గా జరిగాయి. ధనుష్ లాంటి స్టార్ దర్శకత్వంలో ఓ సినిమా తన మొదటి డబ్బింగ్ సినిమా లవ్ టుడే తో తెలుగు సెన్సేషన్ సెట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ నుంచి మరో సినిమా అది కూడా రెండూ యూత్ ని అలరించే సినిమాలు సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఇపుడు తెలుగులో డల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీనితో ఈ ఎఫెక్ట్ వసూళ్లపై కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇలా ఈ రెండు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్టే చెప్పాలి. మరి మౌత్ టాక్ పెరిగితే కానీ ఇవి సేవ్ కాకపోవచ్చు.