టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు వెబ్ సిరీస్ ఫార్మాట్లోకి కూడ ప్రవేశించారు. ఇప్పటికే ‘బ్రీత్: ఇన్టు ద షాడోస్’ అనే వెబ్ సిరీస్ చేసి మెప్పించిన ఈమె కొత్తగా ఇంకో వెబ్ సిరీస్ చేయనున్నారు. గత వెబ్ సిరీస్ హిందీ నుండి తెలుగులోకి అనువాదం కాగా ఇప్పుడు చేయబోయేది స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీస్. దీనిని ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, స్టార్ ప్రొడ్యూజర్ అశ్వినీ దత్ కుమార్తె అయిన స్వప్న దత్ నిర్మించనున్నారు.
గోమటేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌కి ప్రముఖ నవలా, సినీ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథను అందించడం జరిగింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లలో ఈ సిరీస్ ఉండనుంది. డిసెంబర్ లేదా జనవరి నుండి షూటింగ్ మొదలుకానుంది. నటుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల సూపర్ విస్జంలో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ వెబ్ సిరీస్ ఏ జానర్లో ఉంటుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.