జాక్వలిన్ ఫెర్నాండేజ్..ఈ పేరు మన దగ్గర కాస్త కొత్తే కానీ నార్త్ లో మాత్రం బాగా తెలుసు. కనై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా “సాహో” స్పెషల్ సాంగ్ లో కనిపించి తెలుగు ఆడియెన్స్ ను కైపెక్కించిన ఈ హాట్ బ్యూటీ బాగా నోటిస్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్త్ఉన్న పీరియాడిక్ డ్రామాతో మొట్ట మొదటి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుంది.
అయితే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ ముంబైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఇప్పుడు చేస్తున్న సినిమాకు సంబంధించి బాగా ఎగ్జైటెడ్ గా స్పందించిందట. దీనితో ఆమెకు తెలుగు సినిమాలు అంటే మరింత ఇంట్రెస్ట్ ఉందని మరిన్ని ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నానని మనసులో మాట చెప్పేసింది. మరి ఇక ముందు రానున్న రోజుల్లో ఈమెకు టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. ప్రస్తుతానికి ఈ హాట్ హీరోయిన్ పలు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉంది.