“ఆదిపురుష్” కోసం ప్రభాస్ మరీ ఈ రేంజ్ డెడికేటివ్ గానా?

బాహుబలి సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డెడికేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆ ఒక్క సినిమా కోసం తీవ్రంగా ప్రభాస్ కష్టపడ్డాడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడ నుంచి మళ్ళీ తిరిగి చూసుకోలేదు. దీనితో ప్రభాస్ ఓ సినిమా చేస్తే అది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవుతుంది.

అలా డార్లింగ్ చేపట్టిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో చేయనున్న “ఆదిపురుష్” ఒకటి. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అప్పుడు లాక్ డౌన్ లో ఉన్నప్పుడే మళ్ళీ విల్లు పట్టి రాముని పాత్ర కోసం సంసిద్ధం అయ్యాడు.

అందుకోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసుకున్న డార్లింగ్ డెడికేషన్ విని ఓహో అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ స్క్రిప్ట్ విషయంలో గంటల కొద్దీ చర్చలు చేస్తున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనితో కేవలం స్క్రిప్ట్ కోసమే ప్రభాస్ ఈ రేంజ్ లో డిస్కషన్ కు పాల్గొంటున్నాడంటే ఇక సినిమా కోసం ఎంతవరకు వెళ్తాడో చెప్పక్కర్లదు. ఈ చిత్రాన్ని ఓంరౌత్ అండ్ టీం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ విజువల్స్ తో తెరకెక్కించనున్నారు.

Exit mobile version