సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశారు. మాస్క్ ధరించి ఉన్న మహేష్ ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాధారణ జీవితం మొదలైంది. సేఫ్ ఫ్లైట్ జర్నీ కోసం అన్నివిధాలా సిద్ధం అయ్యాం. మరలా ట్రాక్ లోకి వచ్చాము. జెట్ సెట్ గో అని కామెంట్ పెట్టారు. ఇంస్టాగ్రామ్ లో మహేష్ పంచుకున్న ఫోటో ద్వారా ఆయన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ కి వెళుతున్నారని అర్థం అవుతుంది.
ఏ కొంచెం విరామం దొరికినా ఫ్యామిలీ తో ట్రిప్ కి వెళ్లడం మహేష్ కి అలవాటు. సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల తరువాత ఆయన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. కరోనా వైరస్ వలన ఏర్పడిన పరిస్థితుల అనంతరం మహేష్ కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. దాదాపు ఆరు నెలలుగా మహేష్ తన కుటుంబంతో ఇంటిలోనే ఉంటున్నారు.
మరికొద్దిరోజులలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ మొదలయ్యే లోపు ఓ ఫ్యామిలీ ట్రిప్ పూర్తి చేయాలని మహేష్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకానుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.