మన టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో సమంతా కూడా ఒకరు. ఎలాంటి రోల్ కు అయినా సరే చెయ్యగలిగే సమంతా ఒకపక్క సినిమాలతో పాటుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లేటెస్ట్ గా స్మాల్ స్క్రీన్ లోకి కూడా అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా” లో ఒక బిగ్గెస్ట్ షో ను హోస్ట్ చెయ్యడానికి ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.
ఆహా లో “సామ్ జామ్ సమంత” గా ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ సెలెబ్రెటీ షో ను గాను నిన్న ఆహా యూనిట్ ప్రకటించారు. అయితే దీనితో పాటుగా ఈ షోకు గట్టి ప్రమోషన్స్ నే చేస్తున్నారు. అందులో భాగంగా వీరు ఈ షోతో సామ్ పై ఒక భారీ కటౌట్ ను కొట్టించి దానిని సామ్ మరియు టాలీవుడ్ అగ్ర నిర్మాత మరియు ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్ సమక్షంలో లాంచ్ చేసారు. దీనితో సమంతా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ బిగ్గెస్ట్ షో వచ్చే నవంబర్ 13 నుంచి ఆహా లో ప్రీమియర్స్ తో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానుంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1324936396348432385?s=20