గతేడాది ఆఖరులో విడుదలైన తమిళ చిత్రం ‘ఖైదీ’ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది. హీరోయిన్, పాటలు లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడం, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ టేకింగ్ బాలీవుడ్ నిర్మాతల్ని బాగా ఆకర్షించింది. అందుకే ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చెయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థతో కలిసి ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వెలువడింది. అయితే కార్తి హీరోగా చేసిన ఈ కథలో ఏ హిందీ నటుడు నటిస్తాడు, ఇతర నటీనటులేవరు, డర్శకత్వ భాద్యతలు ఎవరికి అప్పగిస్తారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.