సంక్రాంతి సినిమాల జోరు తగ్గట్లేదుగా.

ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపించింది. విడుదలైన నాలుగు చిత్రాలలో పెద్ద చిత్రాలు రెండు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. మహేష్-అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ చిత్రం కొనసాగుతుంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో 23రోజులలో కోటి రూపాయల వసూళ్లు సాధించి బాహుబలి 2, రికార్డుని సైతం అధిగమించింది.

మరో పక్క అల వైకుంఠపురంలో చిత్ర ప్రభంజనం మాములుగా లేదు. బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ ఇండస్ట్రీ హిట్ దిశగా వెళుతుంది. ఇప్పటికే యూఎస్ నాన్ బాహుబలి రికార్డ్ సొతం చేసుకున్న ఈ చిత్రం బన్నీ పేరిట అనేక రికార్డ్స్ నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాలలో అనేక థియేటర్స్ లో అల వైకుంఠపురంలో కొనసాగుతుండగా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురంలో చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాభాలను గడిస్తున్నారు. ఇలా సంక్రాంతి హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ జోరు కొనసాగిస్తున్నారు. 2020 సంక్రాంతి టాలీవుడ్ కి ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

Exit mobile version