హీరో రామ్ ప్రస్తుతం రెడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ తెరకెక్కిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా రెడ్ మూవీ తెరకెక్కుతుంది. హీరో రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇక నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రెడ్ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఐతే హీరో రామ్ వరుస ఫోటో షూట్ లతో ఆసక్తి రేపుతున్నారు. గతంలో వారియర్ గెటప్ తో వింటేజ్ లుక్ లో అదరగొట్టిన రామ్ లేటెస్ట్ గా ట్రెడిషనల్ దేశి గెటప్ లో అదరగొట్టాడు. ఇలా వరుస ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో. ఇక గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన చేసిన ఇస్మార్ శంకర్ సూపర్ హిట్ గా నిలిచింది.
You say..
Love..#RAPO pic.twitter.com/t4iXyJ7kHD
— RAm POthineni (@ramsayz) February 2, 2020