హాంక్ కాంగ్ వెళుతున్న గుడ్ న్యూస్.

హీరో అక్షయ్ కుమార్ గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు విడుదల చేశారు. విడుదలైన అన్ని చిత్రాలు విజయం సాధించాయి. వీటిలో చివరిగా డిసెంబర్ లో గుడ్ న్యూస్ అనే రొమాంటిక్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ విడుదల అయ్యింది. ఈ చిత్రం దాదాపు రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో విశేష ఆదరణ దక్కించుకున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ మూవీ హాంగ్ కాంగ్ లో లోకల్ లాంగ్వేజ్ లో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ఈ చిత్రం ఆ దేశంలో విడుదల కానుంది. నిన్న హీరో అక్షయ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయం పంచుకోవడంతో పాటు, ఆనందం వ్యక్తం చేశారు.

కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో రెండు జంటల విషయంలో డాక్టర్స్ చేసిన పొరపాటు ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే విషయాన్ని, దర్శకుడు రాజ్ మెహతా కామెడీ అండ్ ఎమోషనల్ గా చెప్పారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కి జోడిగా కరీనా కపూర్ నటించగా ధిల్జిత్ సింగ్ కి జోడిగా కియారా అద్వానీ నటించడం విశేషం.

Exit mobile version