పవన్ కెరీర్లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వరుస పరాజయాల్లో ఉన్న పవన్‌ను హిట్ ట్రాక్ ఎక్కించింది ఈ చిత్రమే. డైరెక్టర్ హరీష శంకర్ పవన్ ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని స్టార్ డైరెక్టర్ అవడమే కాకుండా పవన్ అభిమానుల్లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఇదే గోల్డెన్ ఛాన్స్ మళ్లీ వచ్చింది. పవన్ యొక్క 28వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందారాయన.
ఈ సంగతి తెలిసిన ఫ్యాన్స్ పవన్ ప్రకటించిన అన్ని సినిమాల్లోకి ఈ కాంబినేషన్ సూపర్ కిక్ ఇస్తోందని అంటున్నారు. అంతేకాదు ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తారో రాబోయే చిత్రంలో కూడా అలానే ఉండాలని, డైలాగ్స్, యాటిట్యూడ్, ఫైట్స్, ఫన్, పాటలు అన్నీ ఊర మాస్ అనే తరహాలో ఉండేలా చూడమని హరీష్ శంకర్‌ను కోరుతున్నారు. ఇక హరీష్ శంకర్‌కు మాస్ జనాల పల్స్ బాగా తెలుసు కాబట్టి ఈసారి కూడా అభిమానుల అభిరుచికి తగ్గట్టే పక్కా కమర్షియల్ ఎంటెర్టైనర్ అందించగలరనడంలో సందేహపడాల్సిన పనిలేదు.