విజయ యాత్రకు సిద్దమైన అశ్వథామ

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ నిన్న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగ శౌర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రేక్షకుల నుండి వస్తున్న ఈ ఆదరణ రీత్యా నాగ శౌర్య సక్సెస్ టూర్స్ ప్లాన్ చేశారు. నేడు విజయవాడ, ఏలూరు, భీమవరం ప్రాంతాలలో అశ్వథామ మూవీ ఆడుతున్న థియేటర్స్ కి వెళ్లి ప్రేక్షకులను స్వయంగా కలవనున్నాడు.

ఇప్పటికే విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్, స్వర్ణ కాంప్లెక్స్ నందు అశ్వథామ టీమ్ సందడి చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఏలూరు సత్యనారాయణ కాంప్లెక్స్ నందు ఫస్ట్ షోకి, భీమవరం పద్మాలయ కాంప్లెక్స్ నందు సెకండ్ షో కి హాజరుకానున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించగా దర్శకుడు రమణ తేజ తెరకెక్కించారు. అశ్వథామ మూవీలో మెహ్రిన్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version