మెగా హీరో సాయి ధరమ్ చాలా కాలం తరువాత ఓ సూపర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండగే రికార్డ్ వసూళ్లు సాధించింది. సాయి ధరమ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ పెట్టుబడికి రెండింతల లాభం తెచ్చిపెట్టింది. థమన్ సాంగ్స్, రాశి ఖన్నా సాయి ధరమ్ కెమిస్ట్రీ, సత్య రాజ్, రావు రమేష్ ల నటన చిత్రంలో హైలెట్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం సాయి ధరమ్ మరో కొత్త చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు.
సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో హీరోగా సాయి ధరమ్ నటిస్తున్నారు. గత ఏడాది ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. మే 1న మేడే కానుకగా సోలో బ్రతుకే సో బెటర్ విడుదల కానుంది. ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే కానుకగా ఈ చిత్ర థీమ్ వీడియో విడుదల చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.