ఇస్మార్ట్ రామ్ కోసం అసలు కథకి చాలా మార్పులు చేసినట్టున్నారే..!

గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో రామ్. డైనమిక్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో చార్మి నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం 75కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ తో రికార్డు వసూళ్లు దక్కించుకుంది. ఈ చిత్రంతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన రామ్ తనకు ‘నేను శైలజ’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలతో మూవీకి కమిట్ అయ్యారు. రెడ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ తాడం కి రిమేక్ అని సమాచారం.

రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ముగ్గురు హీరోయిన్స్ ని ఎంపిక చేశారు. నివేదా పేతురాజ్ మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేస్తుండగా, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కూడా నటిస్తున్నారు. కాగా రామ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒరిజినల్ కథకి చాలా మార్పులే చేశారట దర్శకుడు. హీరోయిన్ రోల్ నిడివి కూడా మరి కొంచెం పెంచినట్టు తెలుస్తుంది . నిజానికి తాడం సినిమాలో హీరోయిన్స్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య రైవల్రీ.. క్రైమ్ సస్పెన్సు ప్రధానంగా చిత్రం నడుస్తుంది. ఇక రెడ్ చిత్రాన్ని స్రవంతిగి రవి కిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version