ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం


వెంకటేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “షాడో” చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలన్నింటిని మెహర్ రమేష్ తెరకెక్కించేసాడని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బృందం రెండు వారాల చిత్రీకరణ తరువాత ముంబై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది ఈ చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రీకరణలో వెంకటేష్,శ్రీకాంత్ మరియు సుప్రేత్ లు పాల్గొననున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తాప్సీ మరియు మధురిమ బెనర్జీ లు నటిస్తున్నారు.పరచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ అంశాలున్నా పాత్రలో కనిపిస్తుండగా ఈ చిత్రం బాగా రావడానికి దర్శకుడు మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రం 2013 జనవరి లో విడుదల కానుంది.

Exit mobile version