మన దేశంలో ఉన్న బెస్ట్ డాన్సర్లలో హ్రితిక్ రోషన్ ఒకరు, ఇది అందరూ ఆమోదించదగిన సత్యం. అలాంటి బాలీవుడ్ హన్డ్సం హీరో మన మిల్క్ బ్యూటీ తమన్నాని మెచ్చుకున్నారు. ఇటీవలే జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో తమన్నా చేసిన డాన్సులు చూసి తమన్నాలో సూపర్బ్ డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయన్నారు. ఈ వేడుక తర్వాత హ్రితిక్ తమన్నా నటించిన ‘బద్రినాథ్’ మరియు ‘రచ్చ’ సినిమాలను చూసారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ తర్వాత హ్రితిక్ ‘ తమన్నా లాగా డాన్సులు చేయడం ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ హీరోయిన్లకి చాలా కష్టమైన పని అని’ ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఈ విషయం విన్న తమన్నా ఎంతో సంతోషానికి గురయ్యారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘ హ్రితిక్ లాంటి సూపర్బ్ డాన్సర్ నుంచి ఇలాంటి అభినందన అందుకోవడం నాకు చాలా ప్రత్యేకమైనది. ఆయన అభినందనలతో నా భాద్యత మరింత పెరిగింది మరియు నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోవాలని’ ఆమె అన్నారు.