శివ, సందీప్, జయంత్, శ్రావణి మరియు సునీత కొత్త నటీనటులను పరిచయం చేస్తూ కృష్ణమాయ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘రైల్వే స్టేషన్’. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల సెప్టెంబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర విషయాలను తెలిజేయడానికి ఈ రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ ‘150కి పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన నేను మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇటీవలే విడుదలైన ఆడియోకి రెస్పాన్స్ బావుంది అన్నారు. మిగతా నటీ నటులంతా ఈ సినిమాలో నటించినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.