హీరోగా కెరీర్ మొదలు పెట్టి హీరో అవకశాలు తగ్గిపోయాక ప్రతి నాయకుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సుమన్. ఈ రోజు (ఆగష్టు 28) పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడుతూ ‘తెలుగులో ఇపటి వరకు 99 సినిమాల్లో నటించాను. త్వరలో 100 సినిమాలు పూర్తి చేస్తాను. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, భాషల్లో కలిపి 300 చిత్రాలకు పైగా నటించాను. నేను సినిమా పరిశ్రమలోకి 1977 వ సంవత్సరంలో వచ్చాను. దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఇన్ని ఏళ్ళుగా నన్ను మోస్తున్న పరిశ్రమకు ధన్యవాదాలు’. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, కన్నడలో ఒకటి, తెలుగులో మూడు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నట్లు అయన తెలిపారు.