సెప్టెంబర్ మొదటి వారంలో రానున్న ‘పీపుల్స్ వార్’


ఆర్. నారాయణ మూర్తి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదురించే సినిమాలు తీయడంలో సిద్ద హస్తుడు. ఆర్. నారాయణ మూర్తి కొత్త చిత్రం ‘ పీపుల్స్ వార్’ సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం గురించి నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ఒక రైతుకి సొంత భూమి లేదు, ఒక కార్మికుడికి తన కుటుంబాన్ని పోషించడానికి సరైన ఉద్యోగం లేదు. మన సమాజంలో ఇలాంటి విలువలు కనుమరుగైపోతున్నాయి. మన నిర్వాహకులే ‘అభివృద్ధి(ప్రోగ్రెస్)’ పేరుతో ఇదంతా చేస్తున్నారు. ఒక జిల్లాలోని ప్రజలు ఇలాంటి వాటిపై వారికి న్యాయం జరగాలని నిర్వాహకులతో పోరాటం సాగిస్తారు ఇదే ఈ చిత్ర కథాంశం అని’ ఆయన అన్నారు.

ఈ చిత్రంలో శ్రీ హరి మరియు పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథ రాసుకోవడానికి ప్రేరణ ఎలా కలిగింది అని అడిగిన ప్రశ్నకు నారాయణ మూర్తి సమాధానమిస్తూ’ సోంపేట మరియు కాకరపల్లి ప్రజలు తమ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని పోరాటం సాగించారు.ఆ సంఘటన నుంచే ఈ కథని రాసుకున్నాను మరియు ఆ పోరాటంలో బలైపోయిన గున్న జోగరావు అనే పాత్రను శ్రీ హరి ఈ చిత్రంలో పోషిస్తున్నారు’. ఆర్. నారాయణ మూర్తి ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాత.

Exit mobile version