‘దేవుడు చేసిన మనుషులు’ తూర్పు గోదావరి కలెక్షన్ రిపోర్ట్

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రోజు అనుకున్నంత కలెక్షన్లు సాదించలేదు. ఈ చిత్రం మొదటి రోజు తూర్పు గోదావరిలో 16.40 లక్షల షేర్ సంపాదించింది. ఈ కలెక్షన్ రవితేజ లెవల్ కి చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం మొత్తంగా 45 లక్షలు సంపాదిస్తునదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, రవితేజ మునుపటి చిత్రం ‘నిప్పు’ దీని కంటే ఎక్కువే కలెక్ట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు.

Exit mobile version