విక్టరీ వెంకటేష్ హీరోగా చిత్రీకరణ జరుపుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘షాడో’. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ ని వినాయక చవితికి విడుదల చేయనున్నామని ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్ గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిన్స్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రంతోనైనా బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ కొట్టాలనుకుంటున్నారు.