నైజాం ఏరియాలో ఏడు కోట్లపై కన్నేసిన ‘జులాయి’.!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రానికి ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు మరియు జరుగుతున్న టికెట్స్ బుకింగ్ చూస్తుంటే నైజాంలో ఈ చిత్రం మొదటివారం సుమారు 7 కోట్ల పైనే షేర్ సాదించేలా ఉంది. ఈ చిత్రం విడుదలైన చాలా కేంద్రాల్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది మరియు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు కనుక ఈ చిత్ర కలెక్షన్లకు ఎలాంటి డోఖా ఉండదు. ఈ చిత్రం ఇలాగే ఎక్కువ కేంద్రాల్లో మరికొన్ని రోజులు ప్రదర్శించబడితే ‘జులాయి’ చిత్ర నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్ మరియు అల్లు అర్జున్ స్టైలిష్ డాన్సులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Exit mobile version