సెప్టెంబర్లో రానున్న రజనీకాంత్ తొలి 3డి మూవీ


సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు శ్రియా సరన్ హీరో హీరోయిన్లుగా సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శివాజీ’ చిత్రాన్ని ఈ సెప్టెంబర్లో 3డి మాయా జాలంలోకి మార్పు చేసి మళ్ళీ ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ మరియు ప్రసాద్ లాబ్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని 3డి లోకి మారుస్తున్నారని మేము ఇది వరకే తెలిపాము. అన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డి వర్షన్ మొదటి కాపీని ఈ రోజు ఉదయం చెన్నైలో ప్రత్యేకంగా మీడియా వారికి ఒక షో వేశారు, ఈ కార్యక్రమానికి రజనీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రం చూసిన వారందరూ సినిమా చాలా బాగుందంటున్నారు మరియు ‘శివాజీ’ చిత్రాన్ని 3డి లో చూస్తుంటే ఒక కొత్త అనుభూతికి లోనయ్యామని చెబుతున్నారు. రజనీకాంత్ కూడా సినిమా చూసిన తర్వాత చాలా ఉత్కంఠతకి లోనయ్యారు మరియు ‘శివాజీ’ చిత్రం మళ్ళీ 3డిలో విడుదలవుతుండడం ఎంతో ఆనందంగా ఉందని, 3డి వర్షన్ కోసం ఎంతో కష్టపడ్డ శంకర్, ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ మరియు ప్రసాద్ లాబ్స్ వారికి అభినందనలు తెలిపారు. 3డిలో వస్తున్న రజనీకాంత్ తొలి చిత్రం ఇది మరియు ఈ చిత్రం తర్వాత సౌందర్య రజనీకాంత్ తీస్తున్న ‘విక్రమ సింహ’ (తమిళంలో కొచ్చాడియాన్) సినిమా కూడా 3డిలో విడుదల కానుంది.

Exit mobile version