ఫిల్మ్ నగర్లో షూటింగ్ జరుపుకొంటున్న రామ్ చరణ్ సినిమా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎవడు’ చిత్రం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లోని క్విజ్నోస్ దగ్గర చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామ్ చరణ్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల భామలు సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాథానుసారంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ‘జంజీర్’ మరియు ‘నాయక్’ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Exit mobile version