హైదరాబాద్ లో భారీ విజయోత్సవ సభ జరుపుకోనున్న “గబ్బర్ సింగ్”


త్వరలో హైదరాబాద్ లో భారీ స్థాయిలో “గబ్బర్ సింగ్” విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు ఈ విషయం ఈరోజు ఇక్కడ జరుగిన విజయోత్సవ సభలో నిర్మాత గణేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమం తేదీని త్వరలో ప్రకటిస్తారు ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరగనుంది. దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాణ బృందం అంతా ఈ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర బృందం అంతా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ని భారీగా అభినందించారు. ఈ చిత్రం పైరసీ మీద చిత్ర బృందం కాస్త దిగ్బ్రాంతికి గురయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ చిత్ర పైరసీ ని అరికట్టడం లో సాయం కోరారు.

Exit mobile version