అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో అనిల్ సుంకర డైరెక్షన్లో తెరకెక్కుతున్న 3D సినిమా కోసం ఖరీదైన రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ ఉండే కెమెరాని అమెరికా నుండి ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు. విజువల్ గా గ్రాండ్ లుక్ ఉండేలా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ వర్గం ఈ కెమెరాని తెప్పించుకున్నట్లు సమాచారం. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించిన అనిల్ సుంకర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ నెల 15 నుండి ప్రారంభమైంది. కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం ఇతర పాత్రల్లో నటిస్తుండగా స్నేహ ఉల్లాల్, కామ్న జెఠ్మలాని కథానాయికలుగా నటించారు.