త్రిషా ఇటీవల ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బవుతోంది. ఎందుకు అనుకుంటున్నారా? క్రికెట్ మాస్టర్ సచిన్ నుండి ఆమె ఒక బహుమతి అందుకున్నారు. ఈ పరిణామానికి ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఒక ప్రముఖ ఇన్సురెన్స్ కంపెనీ ప్రచారకర్తగా ఉంటూ తను సంతకం చేసిన బాట్ త్రిషకి బహుమతిగా అందించారు. సచిన్ లాంటి గొప్ప వ్యక్తి నుండి బహుమతి అందుకోవతంతో త్రిషా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. త్రిషా ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన దమ్ము విడుదలై మంచి విజయమే సాధించింది. తెలుగులో ప్రస్తుతానికి మరే ప్రాజెక్ట్ అంగీకరించనప్పటికీ తమిళ్లో విశాల సరసన సమరాన్ అనే సినిమాలో నటిస్తుంది.