కంపోజిషన్ పూర్తి చేసుకున్న జులాయి టైటిల్ సాంగ్

ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “జులాయి” టైటిల్ సాంగ్ కంపోజిషన్ ని పూర్తి చేశారు. ఇప్పుడే జులాయి టైటిల్ సాంగ్ పూర్తి చేశాము త్రివిక్రమ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లకు కృతజ్ఞతలు ” అని ట్విట్టర్ లో తెలిపారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇలియానా కథానాయికగా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ మరియు సోను సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. డి వి వి వి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Exit mobile version