విలేఖరిగా మారబోతున్న బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ విలేఖరి అవతారం ఎత్తనున్నారు! అదేనండి తన రాబోయే చిత్రం “శ్రీమన్నారాయణ” లో బాలకృష్ణ పాత్రికేయుడి పాత్రలో కనిపించబోతున్నారు . రవి కుమార్ చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ లు కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రధాన పాత్రల మధ్య రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తరువాత మూడు పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లనున్నారు. దర్శకుడు రవి కుమార్ చావాలి ఈ చిత్రం లో బాల కృష్ణ పాత్ర శక్తివంతమయినడిగా పేర్కొన్నారు “సమాజంలో మార్పు తెచ్చేంత శక్తి కలంకి మాత్రమే ఉంది. ఈ చిత్రం లో హీరో కలం ఉపయోగించి సమాజంలో ఎలా పరివర్తన తీసుకొచ్చాడో చూపిస్తున్నాము ఇందులో బాల కృష్ణ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది” అని అన్నారు. ఎల్లో ఫ్లవర్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు ఆర్ ఆర్ మోవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version