పిల్లా పాటకి దేవిశ్రీ కి పలువురు ప్రశంశలు

దేవి శ్రీ ప్రసాద్ “గబ్బర్ సింగ్” చిత్రం లో “పిల్లా” పాటకు సాహిత్యం అందించిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ పాట అందరి ప్రశంశలు పొందుతుంది ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట గురించి దేవి శ్రీ ని అభినందించారు “చంద్రబోస్ గారు,రామజోగయ్య శాస్త్రి గారు,సాహితి గారు, భాస్కర్ భట్ల గారు పిల్ల సాహిత్యం గురించి అభినందించారు” అని ట్విట్టర్ లో చెప్పారు. “సీతారామ శాస్త్రి గారు నిన్న ఫోన్ లో ఈ పాట సాహిత్యం గురించి ఇరవై నిమిషాల పాటు మాట్లాడి అభినందించారు. ఈ పాటలో తెల్ల కాగితం, బ్రేక్ లేని బైక్,ట్రాక్ లేని ట్రైన్ వంటి పదాలు అయన పాడి వినిపించడం నాకు మరింత సంతోషాన్నిచ్చాయి” అని అన్నారు. దేవి సంగీత దర్శకత్వమే కాకుండా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు ఇప్పుడు పిల్ల పాటతో ఆయనలో రచయిత మరింత విజయం సాదించాడు . దీని తరువాత ఏంటో మనం వేచి చూడాలి.

Exit mobile version