ఈ రోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందగాడైన ఒక యువ హీరో పుట్టిన రోజు. ఎవరతను అనుకుంటున్నారా? అతనెవరో కాదు దేవదాస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్. త్వరలో ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా తో మన ముందుకు రానున్న రామ్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత స్రవంతి కిషోర్ గారి తమ్ముడు గారి అబ్బాయి. పెద్ద కుటుంబం నుండి వచ్చిన తన ప్రతిభ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవదాస్, రెడీ, కందిరీగ వంటి హిట్లు కొట్టిన రామ్ త్వరలో ఎందుకంటే ప్రేమంట సినిమాతో మన ముందుకు రానున్నాడు.