గోవాలో సరదాగా గడుపుతున్న కొత్త జంట


కొత్తగా పెళ్ళైన జంట ‘జెనీలియా – రితేష్’ ప్రస్తుతం గోవాలో షికారు చేస్తున్నారు. ఆమె సినిమాలో లేకపోయినా రితేష్ ఆమెను వెంట తీసుకుని మరీ తిరుగుతున్నాడు. రితేష్ ప్రస్తుతం ‘క్యా సూపర్ కూల్ హై హమ్’ అనే సినిమాలో షూటింగ్లో బిజీగా ఉండగా జెనీలియా బీచుల వెంట తిరుగుతూ, తన భర్త రితేష్ తో కలిసి బైకు మీద షికారు చేస్తుంది. జెనీలియా పెళ్లి అయిన తరువాత ఏ సినిమా కూడా అంగీకరించలేదు. జెనీలియా నటించిన బొమ్మరిల్లు రీమేక్ ‘ఇట్స్ మై లైఫ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ‘రాక్ ద షాది’ మరియు ‘బ్లడీ లెసన్’ సినిమాల్లో నటిస్తుంది.

Exit mobile version