యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న భారీ ఏక్షన్ చిత్రం ‘రెబెల్’ ప్రస్తుతం శరవేగం గ షూటింగ్ జరుపుకొని , జూలై లో విడుదల అయ్యేందుకు సిద్ధ పడుతోంది. ఈ చిత్రానికి దీక్ష సెత్ మరియు తమన్నాలు హీరోఇన్లు. అత్యంత భారీ సెట్లు, కళ్ళు చెదిరే ఏక్షన్ సీన్లు ఉండే ఈ చిత్రానికి లారెన్స్ దర్శకుడు. ప్రస్తుతం చివరి షెడ్యూలు షూటింగ్ జరుగుతోంది.
జే. భగవాన్ మరియి జే.పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని లారెన్స్ సమకూరుస్తున్నారు. తమన్ తొలుత సంగీతాన్ని అందించినప్పటికీ, లారెన్స్ తో వచ్చిన విభేదాలు కారణం గా ఆయన చిత్రం నుండి తప్పుకున్నారు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ సినిమా అని విశ్లేషకులు అంటున్నారు.