తిరిగి కలవనున్న కాజల్ మరియు కార్తి ?


కార్తి మరియు కాజల్ ఒక తమిళ చిత్రం కోసం తిరిగి పని చెయ్యబోతున్నారు. గతం లో వీరు ఇరువురు సుసీంద్రన్ తెరకెక్కించిన “నాన్ మహాన్ అల్ల” చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో వీరివురి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.తరువాత వీరు ఇరువురు కలిసి బ్రూ యాడ్ లో కనిపించారు తాజా సమాచారం ప్రకారం దర్శకుడు రాజేష్ తన రాబోతున్న చిత్రం “ఆల్ ఇన్ ఆల్ అళగు రాజ” చిత్రం కోసం ఈ జంట ను తిరిగి తెర మీదకి తీసుకురావాలని సంప్రదించారు. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నారు. ప్రముఖ పత్రికతో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం కాజల్ ని సంప్రదిస్తున్నట్టు ఆమె మాత్రమే ఈ పాత్రకి సరిగ్గా సరిపోతుందని అన్నారు ఈ వేసవికి కాజల్ సూర్య “మాత్రాన్” మరియు విజయ్ “తుపాకి” చిత్రాలలో కనిపించనుంది.

Exit mobile version