గబ్బర్ సింగ్ కోసం థియేటర్లు పెంచుతున్న డిస్ట్రిబ్యూటర్లు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తుండగా చాలా ఏరియాల్లో టికెట్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏరియాల్లో థియేటర్లు పెంచాలని నిర్ణయించారు. నైజాం మరియు కొన్ని ఏరియాల్లో డిమాండ్ మేరకు కొన్ని థియేటర్లు పెంచుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కేరేర్ర్లో దాదాపు పదేళ్ళ తరువాత భారీ హిట్ రావడంతో చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ బాబు నిర్మించారు.

Exit mobile version