పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అన్ని చోట్ల పోజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమెరికా మరియు కొన్ని చోట్ల ఈ చిత్రానికి ప్రీమియర్ షో వేశారు అన్ని ప్రదేశాల నుండి పోజిటివ్ టాక్ వినిపిస్తుంది. పవన్ నటన మరియు బలవంతమయిన మొదటి అర్ధ భాగం చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఇండియా లో కూడా పలు చోట్ల షో లు మొదలయ్యి తొందర్లోనే ఇండియా లో టాక్ కూడా తెలిసిపోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించారు. శృతి హాసన్ కథానాయికగా నటించింది