విడుదల తేది : 21 మార్చి 2014 |
||
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.25/5 | ||
దర్శకత్వం : శరవణన్ |
||
నిర్మాత :లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ | ||
సంగీతం : సి. సత్య |
||
నటినటులు : విక్రమ్ ప్రభు, సురభి… |
ఎప్పటికప్పుడు డబ్బింగ్ రూపంలోమంచి సినిమాలను అందించే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారు తమిళంలో విడుదలైన ‘ఇవన్ వేర మాదిరి’ సినిమాని ‘సిటిజన్’ రూపంలో తెలుగు వారి ముందుకు తీసుకువచ్చారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జర్నీ’కి దర్శకత్వం వహించిన శరవణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సీనియర్ యాక్టర్ ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఈ సిటిజన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
లా మినిస్టర్ లా కాలేజ్ లో తను అడిగినన్ని సీట్స్ ఇవ్వలేదని తన మనుషులతో స్టూడెంట్స్ ని కొట్టిస్తాడు. అక్కడే పోలీసులు, మీడియా ఉన్నా పట్టించుకోకపోవడంతో 3 స్టూడెంట్స్ చనిపోతారు. ఈ విషయంపై ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అదే సిటీకి జాబు కోసం వచ్చిన గుణ(విక్రమ్ ప్రభు) ఈ విషయంపై చనిపోయిన స్టూడెంట్స్ కి న్యాయం జరగాలని ఓ పథకం వేస్తాడు. ఎవ్వరికీ తెలియకుండా లా మినిస్టర్ తమ్ముడు వంశీ కృష్ణని కిడ్నాప్ చేసి సిటీకి అవతల నిర్మాణ దశలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో బందిస్తాడు.
ఆ తర్వాత లా మినిస్టర్ కి కాల్ చేసి రాజీనామా చేయమని బెదిరిస్తాడు, లా మినిస్టర్ చేసేదేమీ లేక రాజీనామా చేస్తాడు. అప్పుడు గుణ వంశీ కృష్ణని విడుదల చేస్తాడు. ఇదంతా జరిగే మధ్యలో గుణ మాలిని(సురభి) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాస్త కోలుకున్న వంశీ కృష్ణ తనని బందించిన వాడు ఎవరా అని వెతుకుతుంటాడు. అప్పుడు గుణ ఏం చేసాడు? వంశీ కృష్ణ నుంచి వచ్చే ఆపదలను ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా తన ప్రేమను కాపాడుకున్నాడు? అనేది మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ రెండు.. ఒకటి ఫస్ట్ హాఫ్ లో విక్రమ్ ప్రభు – సురభి మధ్య వచ్చే లవ్ ట్రాక్.. ఈ లవ్ ట్రాక్ ప్రేక్షకులకి నవ్వు తెప్పించేలా ఉండడమే కాకుండా మంచి ఫీల్ కూడా ఉంటుంది. ఇక రెండవది సెకండాఫ్ లో హీరో – విలన్ మధ్య వచ్చే కొన్ని ఎలిమెంట్స్ చాలా థ్రిల్లింగ్ గాఉంటాయి. ముఖ్యంగా విలన్ హీరోయిన్ ని దాచిపెట్టే ప్లేస్ అందరినీ ఆకట్టుకుంటుంది.
సురభి చూడటానికి బాగుంది, అలాగే తన పాత్రకి నటన పరంగా పూర్తి న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో గణేష్ వెంకట్రామన్ నటన బాగుంది. ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న యంగ్ విలన్ పాత్రలో వంశీ కృష్ణ ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాలోని చేజింగ్, ఫైట్ సీక్వెన్స్ లు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన మైనస్ హీరో విక్రం ప్రభు అనేచెప్పాలి . ఎందుకంటే కూల్, సీరియస్, లవ్, ఎమోషనల్ ఇలా అన్ని సీన్లకు ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చి చిరాకు తెప్పించాడు. ఒకవేళ డైరెక్టర్ సినిమా మొత్తం ఇదే ఎక్స్ ప్రెషన్ పెట్టమనునుంటే మనం ఏమీ అనలేం కానీ అది నిజం కాకపోతే మాత్రం విక్రమ్ ప్రభు హావభావాల విషయంలో ముందు ముందు చేయబోయే సినిమాల్లో అన్నా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ సినిమా ప్రారంభం పరవాలేధనిపించినా ఆ తర్వాత బాగా స్లో అయిపోతుంది. అ తర్వాత వచ్చే లవ్ ట్రాక్ పరవాలేధనిపించినా కథ అస్సలు ముందుకు కదలదు. సెకండాఫ్ ని కాస్త వేగంగా నడిపించినా క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. కథనం కూడా అంత ఆసక్తి కరంగా ఉండదు. పాటలు సినిమాకి పెద్ద హెల్ప్ చెయ్యలేదు. ఒక్క లవ్ ట్రాక్ లో తప్ప మిగతా ఎక్కడా కామెడీ అనేది ఉండదు.
సాంకేతిక విభాగం :
శక్తి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సి. సత్య అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపధ్య సంగీతం మాత్రం పరవాలేదనిపించింది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఓవరాల్ గా ఉన్న కొన్ని బోరింగ్ ఎపిసోడ్స్ ని మరీ సాగదీయకుండా కట్ చేసి ఉంటే బాగుండేది. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా కంపోజ్ చేసారు.
జర్నీ సినిమాతో క్రియేట్ చేసిన మేజిక్ ని శరవణన్ ఈ సినిమాతో క్రియేట్ చేయలేకపోయాడు. తమిళంలో ఒక కామన్ మాన్ హీరోగా మారిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ అదే కాన్సెప్ట్ ని కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంలో శరవణన్ కొన్ని తప్పులు చేసాడు. దానివల్ల ప్రేక్షకులలో ఈ సినిమా పెద్దగా రిజిస్టర్ కాలేకపోయింది. లవ్,యాక్షన్, థ్రిల్స్ లాంటి కొన్ని పాయింట్స్ బాగున్నప్పటికీ వాటన్నిటినీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో శరవణన్ ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు :
జర్నీ సినిమా డైరెక్టర్ నుంచి సినిమా అనగానే అదే మేజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఆడియన్స్ ‘సిటిజన్’ సినిమాకి వస్తారు. కానీ ఆ మేజిక్ ని సిటిజన్ రిపీట్ చేయలేకపోయింది. సినిమాలో అక్కడక్కడా ఆకట్టుకునే పలు అంశాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకేలా ఉండే విక్రమ్ ప్రభు ఎక్స్ ప్రెషన్స్, కనెక్ట్ కాని ఎమోషన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అయితే లవ్ ట్రాక్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్. సినిమాకి వెళ్ళాలా? వద్దా? అనేది చెప్పలేను కానీ ఒకవేళ వెళితే మరీ ఇంత దారుణమైన సినిమా చూసాం ఏందిరా అనే ఫీలింగ్ అయితే కలగకుండా బయటకు వస్తారని మాత్రం భరోసా ఇవ్వగలను..
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం