వాయిదా పడ్డ ఎటో వెళ్ళిపోయింది మనసు ఆడియో లాంచ్


నాని మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్ర ఆడియో విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్ర ఆడియోను ఈ రోజు (సెప్టెంబర్ 2) విడుదల చేయాలనుకున్నారు మరియు ఈ వేడుకలో మాస్ట్రో ఇళయరాజా మరియు అతని టీంతో కలిసి లైవ్ కచ్చ్హేరి చాయనున్నారని తెలిపారు కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆడియో విడుదల వాయిదా పడింది. ఈ చిత్ర తమిళ్ వర్షన్ ‘నీతానే ఎన్ పొన్వసంతం’ చిత్ర ఆడియో నిన్న చెన్నైలో అతిరథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా లైవ్ కచ్చేరి చూసిన అతిదులందరూ ఆయన్ని పొగడకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నెల చివరిలోగా చిత్రీకరణ పూర్తిచేసి ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version