యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ‘ప్రేమకు నమస్కారం’

యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ‘ప్రేమకు నమస్కారం’

Published on Sep 17, 2025 8:00 AM IST

shanmukh

యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్ హీరోగా, ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం “ప్రేమకు నమస్కారం”. వి.భీమ శంకర్ దర్శకత్వంలో, ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ – భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ, భూమిక, బ్రహ్మాజి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

షణ్ముఖ్‌ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీడియోలో లవ్‌ ఫెయిల్యూర్స్, బ్రేకప్‌ తర్వాత యువత అనుభూతులను ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ముఖ్యంగా – “ప్రేమలో విఫలమైతే మందు, సిగరెట్లకే ఖర్చు చేసే డబ్బుతో భూమి, కారు కొనొచ్చు” అన్న డైలాగ్స్‌ నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

దర్శకుడు మాట్లాడుతూ “ఇది యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌. నేటి యువత లవ్‌, బ్రేకప్ వంటి ఎమోషన్స్‌ను వినోదాత్మకంగా చూపించబోతున్నాం” అన్నారు. నిర్మాతలు “కొత్త కాన్సెప్ట్‌, హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా తప్పక ఆకట్టుకుంటుంది” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు