యహీ హై మేరా అడ్డా అంటున్న సుశాంత్

యహీ హై మేరా అడ్డా అంటున్న సుశాంత్

Published on Oct 20, 2012 11:25 AM IST


అక్కినేని నాగేశ్వరరావు గారి వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మరో హీరో సుశాంత్. ఇంకా ఒక్క విజయాన్ని కూడా అందుకోని సుశాంత్ ‘కరెంట్’ సినిమా తర్వాత సుమారు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ‘అడ్డా’. ప్రస్తుతం ఈ చిత్రంలోని ‘యహీ హై మేరా అడ్డా’ అనే పాటని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్ర టీం యూరప్ కి పయనం కానున్నారు. అక్కడ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సుశాంత్ సరసన శాన్వి కథానాయికగా నటిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మరియు నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

తాజా వార్తలు