“వకీల్ సాబ్” అప్పుడు పలకరించనున్నాడా?

ఎన్నో పండుగలు స్పెషల్ అకేషన్స్ పోతున్నాయి కానీ పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అవన్నీ పవన్ ఫ్యాన్స్ కు అందని ద్రాక్ష లానే మిగిలాయి. అప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఊహించని రీతిలో పలు ప్రాజెక్టులను ప్రకటించేసి అదిరిపోయే వార్తలను అందించినప్పటికీ దాదాపు కంప్లీట్ అయ్యిన సినిమా వకీల్ సాబ్ కావడంతో టీజర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇపుడు ఆ టీజర్ ఈ దీపావళికి వస్తుందా అన్న గాసిప్స్ వినిపిస్తున్నప్పటికీ సినీ వర్గాల నుంచి అయితే అందుకు ఓకే అనే సంకేతాలు అయితే కనిపించడం లేదు. దీనితో పవన్ అభిమానులను ఈ పండుగ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరోపక్క చిత్ర యూనిట్ పై కూడా పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నారు. మరి నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకుడు శ్రీరామ్ వేణు లు ఏం ప్లాన్ చేసారో అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version