సునీల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా!

సునీల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా!

Published on Feb 28, 2013 8:15 AM IST

Sunil
సునీల్ కమెడియన్ గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హీరోగా మారి రిస్క్ చేసాడు అనుకున్నారు. మొదటి సినిమా అందాల రాముడు లక్ మీద హిట్ అయిందనుకున్నారు. రెండవ సినిమా రాజమౌళి కాబట్టి హిట్ అయింది అన్నారు. మూడవ సినిమా అప్పలరాజు ఫ్లొప్ అవడంతోఇంక సునీల్ పని అయిపోయినట్లే అనుకున్నారు. సిక్స్ ప్యాక్ తో వచ్చిన పూల రంగడు పెద్ద హీరోల రేంజ్ హిట్ కొట్టాడు. సునీల్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ పెళ్ళికొడుకు అన్ని హంగులు పూర్తి చేసుకుని రేపు విడుదలకి సిద్ధమయింది. పూల రంగడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇషా చావ్లా ఈ సినిమాలో కూడా జత కట్టింది. ఈ సినిమాలో కూడా సునీల్ సిక్స్ ప్యాక్ చుపిస్తుండటంతో సేమ్ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాబోతుంది అనిపిస్తుంది. దేవి ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఎస్.ఎ రాజ్ కుమార్ దర్శకుడు.

తాజా వార్తలు