ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!

ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!

Published on Sep 13, 2025 8:02 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజి’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రంతో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ తొలిసారి టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.

ఇటీవల మేకర్స్ షూటింగ్ ఫైనల్ డే సందర్భంగా తీసిన ఒక ఫోటోను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్‌తో పాటు యూనిట్ సభ్యులు ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు