సూర్యకుమార్ యాదవ్: T20 ప్రపంచకప్ హీరో, ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – అద్భుతమైన కెరీర్ హైలైట్స్!

సూర్యకుమార్ యాదవ్: T20 ప్రపంచకప్ హీరో, ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – అద్భుతమైన కెరీర్ హైలైట్స్!

Published on Sep 14, 2025 12:58 AM IST

Suryakumar-Yadav

భారత క్రికెట్‌లో “SKY” అని ముద్దుగా పిలిచే సూర్యకుమార్ యాదవ్ పేరు వినగానే ప్రేక్షకులకు ఉత్సాహం వస్తుంది. ఆయన ఆటలో ధైర్యం, వినూత్నత, అందమైన షాట్లు – ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. చిన్న ఫార్మాట్ అయినా, పెద్ద మ్యాచ్ అయినా ఆయన తన ముద్ర వేసుకుంటారు.

అంతర్జాతీయ కెరీర్

2021లో భారత జట్టులోకి వచ్చిన తర్వాత సూర్యకుమార్ తక్కువ సమయంలోనే భారత T20 ఆటకు ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు.

మొత్తం 122 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
3,386 పరుగులు సాధించాడు (టెస్టు – 8 runs, వన్డే – 773 runs, T20I – 2605 runs).
4 సెంచరీలు, 25 అర్ధసెంచరీలు చేశాడు.
T20ల్లో ఆయన రికార్డు అసాధారణం. ఫీల్డ్‌లో ఎక్కడైనా బంతిని ఆడగల “360° ఆటగాడు” ఆయనే అని చెప్పాలి.

పెద్ద విజయాలు

సూర్యకుమార్ అనేక ముఖ్యమైన టోర్నమెంట్లలో భారత జట్టుకు నిలువుటద్దంగా నిలిచాడు:

T20 ప్రపంచ కప్ 2024 విజేత – ఫైనల్లో పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్ ఎన్నటికీ మరిచిపోలేము.

ఆసియా కప్ విజయం 2023 – తన ప్రదర్శనతో జట్టుకు బలం ఇచ్చాడు.

ICC T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2022, 2023) – వరుసగా రెండు సార్లు గెలవడం ఆయన ఆధిపత్యానికి నిదర్శనం.

భారత్ తరఫున అత్యధిక Player of the Match అవార్డులు T20ల్లో అందుకున్న ఆటగాడు.
IPL & దేశీయ విజయాలు
IPLలో కూడా SKY రాణించాడు.

ఇప్పటివరకు 4311 పరుగులు IPLలో చేశాడు.
2014లో KKRతో ఛాంపియన్ అయ్యాడు.
2019, 2020లో ముంబై ఇండియన్స్‌తో వరుసగా టైటిల్స్ గెలిచాడు.
ఆయన అతికష్టం అయిన సందర్భాల్లో కూడా రాణించగల ఆటగాడిగా జట్టుకు విశ్వాసం కలిగించారు.

సూర్యకుమార్ బ్యాటింగ్ అంటే కేవలం పరుగులు కాకుండా ఆటలో ఒక వినోదం. బౌలర్లు వేసిన బంతిని విభిన్న కోణాల్లో కొట్టడం, ఒత్తిడిలో కూడా ధైర్యంగా ఆడటం, పెద్ద మ్యాచ్‌ల్లో మెరుపులు చూపడం – ఇవే ఆయన ప్రత్యేకతలు.

సూర్యకుమార్ యాదవ్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు – అతను మంచి వినోదం ఇచ్చే ఆటగాడు, కొత్తదనం చూపించే ఆటగాడు, నిజమైన విజేత.

మన 360° స్టార్ సూర్యకుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

తాజా వార్తలు