తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా పర్ఫార్మెన్స్, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర అప్పుడే 1 మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ ఫీట్ చేసి తేజ సజ్జా మరోసారి తన సత్తా చాటాడు.
ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ పాత్రకు సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించాడు. మరి ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.