‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ? దర్శక ధీరుడు డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు ? ఇలా గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ తోనే గడిపేస్తున్నారు.
అసలు ఇంతకీ రాజమౌళి ఎన్టీఆర్ పై ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేస్తాడా ? అంటే.. తనకే తెలియదని, కరోనా కారణంగా వర్క్ పోస్ట్ ఫోన్ అయిందని.. అయితే అప్పటికీ తారక్ పాత్రకు సంబంధించి వచ్చిన అవుట్ ఫుట్ ను బట్టే రిలీజ్ చేస్తామని రాజమౌళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ ను రాజమౌళి టెన్షన్ లో పెట్టినట్లు అయింది.
ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. అన్నట్టు ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి ఆ మధ్య బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశంలో తారక్ లుక్ రివీల్ అయింది. మరి ఆ లుక్ లోనే సినిమా మొత్తం కనిపిస్తాడా లేక వేరే వేరియేషన్స్ కూడా ఉంటాయా అనేది చూడాలి.
డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.